Ponnam Prabhakarకు రేవంత్ రెడ్డి కీలక హామీ

by GSrikanth |   ( Updated:2023-07-23 15:41:07.0  )
Ponnam Prabhakarకు రేవంత్ రెడ్డి కీలక హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​పార్టీలో ఇటీవల ఏర్పాటు చేసిన ఎన్నికల టీమ్‌లో తన పేరు లేకపోవడంతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అనుచరులతో కలసి ఆదివారం గాంధీభవన్‌లో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసిన తనకే అవకాశం ఇవ్వకపోతే ఎలా? అంటూ పార్టీ పెద్దలను ప్రశ్నించారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ ఇంచార్జీ థాక్రేలు చొరవ తీసుకొని మరో కమిటీలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ దృష్టిలో ఈ అంశం ఉన్నదని, మరో రెండు మూడు రోజుల్లో పార్టీలో ఇంటర్నల్‌గా చర్చించి అవకాశం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. దీంతో పొన్నం అనుచరులు ఆందోళనలు ఆపారు.

Advertisement

Next Story