Khanapur MLA Rekha Nayak : బీఆర్ఎస్‌కు భారీ షాక్.. గులాబీకి రేఖా నాయక్ దంపతులు గుడ్ బై..!

by Satheesh |   ( Updated:2023-08-21 17:50:02.0  )
Khanapur MLA Rekha Nayak : బీఆర్ఎస్‌కు భారీ షాక్.. గులాబీకి రేఖా నాయక్ దంపతులు గుడ్ బై..!
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్‌లో కుంపటి మొదలైంది. రానున్న ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ దంపతులు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అనంతరం రేఖానాయక్ భర్త కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేఖానాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేఖా నాయక్ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ఖానాపూర్ టికెట్‌ను మంత్రి కేటీఆర్ మిత్రుడు భూక్య జాన్సన్ నాయక్‌కు బీఆర్ఎస్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ఇవాళ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 115 మందితో కూడిన లిస్ట్‌ను కేసీఆర్ రిలీజ్ చేశారు. ఈ జాబితాలో ఖానాపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు. దీంతో ఆమె బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Read More: హరీశ్ రావుకు నా తడాఖా చూపిస్తా.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story