119 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ

by GSrikanth |   ( Updated:2023-08-29 14:03:32.0  )
119 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పోట్టుకోకుండా 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని అన్నారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ విషయంలో పార్టీ అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అతి త్వరలో ఎన్నికల కమిటీ వేస్తామని తెలిపారు. కమిటీ మీటింగ్ తర్వాత అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కేడర్‌తో మాట్లాడిన తర్వాతే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. తమది జాతీయ పార్టీ అని.. బీఆర్ఎస్ మాదిరిగా డైనింగ్ టేబుల్‌పై నిర్ణయాలు తీసుకోలేమని ఎద్దేవా చేశారు. వీలైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. అంతేగాక, రాష్ట్ర విమోచన దినోత్సవం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేస్తానని కిషన్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా ప్రజలను కలుస్తామని వెల్లడించారు. ప్రధాని పిలుపు మేరకు పెట్రోల్‌పై అన్ని రాష్ట్రాలు పన్నులను తగ్గించి ధరలు తక్కువ చేస్తే, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పన్నులను తగ్గించకుండా ప్రజలపై భారం వేసిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story