- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎర్రవెల్లి టూ చర్లపల్లి జైలే..? సీఎం కేసీఆర్పై పొన్నాల ఫైర్
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం కేసీఆర్ పై మాజీ పీసీసీ చీప్ పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ దోపిడీ సొమ్ముతో ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారన్నారని విమర్శించారు. దేశంలో అత్యంత అవినీతి సీఎం కేసీఆర్ అని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు కానీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రధాని మోడీ రాజకీయాలను ప్రాధాన్యత ఇచ్చారు కానీ, సమాజ శ్రేయస్సు కోసం కాదన్నారు. సీఎం కేసీఆర్ పై సహర కేసుతో సహ మరో రెండు కేసులు ఉన్నాయన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల లిక్కర్ స్కాం, ధరణిలో అవినీతి, ప్రజాకంఠక పాలన పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎర్రవెల్లి టూ చర్లపల్లి జైళుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణ హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతుందన్నారు. విలీన దినోత్సవం రోజున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశానికి దిశ నిర్దేశం చేయనున్న సోనియాగాంధీ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తూంకుంట నర్సారెడ్డి, తాడూరి శ్రీనివాస్, గుడూరి శ్రీనివాస్, మీసం నాగరాజు, పూజల గోపి, దేవులపల్లి యాదగిరి, బొమ్మల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.