తెలంగాణ ఓటర్లకు ఎన్నికల అధికారి కీలక పిలుపు

by GSrikanth |   ( Updated:2023-11-25 07:19:48.0  )
తెలంగాణ ఓటర్లకు ఎన్నికల అధికారి కీలక పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ప్రజలలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు శనివారం గచ్చిబౌలిలో 'లెట్స్ ఓట్స్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఈవో వికాస్ రాజ్, డీజీపీ అంజనీ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కులం, మతం, జాతి, ప్రాంతం లాంటి ప్రలోభాలకు లొంగకుంటా అభ్యర్థుల గుణగణాలను పరిశీలించి ఓటు వేస్తే ప్రజాస్వామ్య ప్రక్షాళన జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు అన్నారు.

Advertisement

Next Story