- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సోనియా ప్రసంగానికి ముందు ప్రజలకు కాంగ్రెస్ ఓపెన్ అప్పీల్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తొమ్మిదేళ్ల పాలనలో ఛిద్రమయ్యాయని, బంగారు తెలంగాణ నినాదం ఒక బూటకంగా మిగిలిపోయిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృతస్థాయి సమావేశం అభిప్రాయపడింది. కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం మళ్ళీ వెనక్కి వెళ్ళి నయా నిజాం తరహాగా మారిపోయిందని పేర్కొన్నది. ఉద్యమంలోకి దూకిన ప్రజల కోరికలు అసంపూర్ణంగా మిగిలిపోయాయని, అమలుచేయకుండా ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని, కాంగ్రెస్ పాలనతో మాత్రమే ఆ కలలు సాకారమవుతాయని పేర్కొన్నది. కర్ణాటకలో ఇచ్చిన ఫైవ్ గ్యారంటీలలో నాలుగింటిని వంద రోజుల్లోనే అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం జుమ్లా హామీలు ఇవ్వదని, తెలంగాణకు సైతం సిక్స్ గ్యారంటీస్‌ను ఇస్తున్నదని, ప్రజలు ఆశీర్వదించి భవిష్యత్తు కోసం ఓటు వేసి గెలిపించాలని ఆ తీర్మానం ద్వారా ఓపెన్ అప్పీల్ చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర లిఖించడానికి సిద్ధమవుతున్నదని, బంగారు తెలంగాణ నినాదాన్ని నిజం చేసుకునేందుకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓట్ల ద్వారా దీవించాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ డిక్లరేషన్ల ద్వారా రైతులు, సంక్షేమం, యూత్ తదితర సెక్షన్ల ప్రజలకు భరోసా కల్పించిందని, వాటి ఆధారంగానే సిక్స్ గ్యారంటీలు ఉంటాయని నొక్కిచెప్పింది. నీళ్లు-నిధులు-నియామకం నినాదంతో తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం కొట్లాడారని, ఎన్నో రాజకీయ సవాళ్ళను అధిగమించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకున్నదని సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం చేసిన తీర్మానంలో పేర్కొన్నది.
తొమ్మిదేళ్ళ పాలనలో రాష్ట్రంలోని వివిధ సెక్షన్ల ప్రజలు అనేక ఇబ్బందుల్లో కూరుకుపోయారన్నది. అధిక ధరలు, వాతావరణ ప్రతికూల పరిథితులు, సక్రమంగా అమలుకాని బీమా పథకాలతో పేదలు, రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని పేర్కొన్నది. ఇందిరాగాంధీ హయాంలో ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, మైనారిటీలు, ఓబీసీలు తదితర సెక్షన్ల ప్రజలకు భూములపై హక్కులు దక్కితే కేసీఆర్ పాలనలో ధరణి పోర్టల్ ద్వారా అవి ప్రశ్నార్థకమయ్యాయని ఉదహరించింది. లఘు పరిశ్రలకు తగినంత సహకారం ప్రభుత్వం నుంచి లేకపోవడంతో మార్కెట్‌లోని ఒడిదుడుకులతో అవి ప్రమాదంలో పడ్డాయని, ప్రభుత్వ విధానాలతో కార్పొరేట్లకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్‌కు అనుబంధంగా ఉన్న కాంట్రాక్టర్లకు ఆదాయ వనరుగా మారిపోయిందని పేర్కొన్నది. భారీ స్థాయిలో ప్రజాధనాన్ని ఖర్చు పెట్టినా అతి తక్కువ నీటి వసతి మాత్రమే సాధ్యమవుతుని వివరించింది. రాష్ట్రంలోని స్కూళ్ళను, విద్యా సంస్తలను, ఆస్పత్రులను ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తూ వాటి అవసరం ఉన్న ప్రజలకు విద్య, వైద్యాన్ని అందించకుండా చేస్తున్నదని ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడిందని, అందరికీ ఫలాలను అందించాలని తాపత్రయపడిందని, తెలంగాణలో వాటిని సాధించుకోడానికి మరో ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అగత్యం ఏర్పడిందని, అందుకు కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నదని పేరకొన్నది.
అసంపూర్ణంగా మిగిలిపోయిన ఆశలు, ఆకాంక్షలు, అవసరాలను సాధించుకోడానికి, బంగారు భవిష్యత్తును పొందడానికి కాంగ్రెస్‌ను రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతో దీవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లోనే నెరవేర్చిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో ప్రకటించనున్న సిక్స్ గ్యారంటీలనూ అదే చిత్తశుద్ధితో అమలు చేస్తుందని, ఉత్తుత్తి హామీలతో మోసం చేయడం తమ పార్టీ స్వభావం కాదని నొక్కిచెప్పింది.