నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలో పార్టీనే నిర్ణయిస్తుంది: బండి సంజయ్

by GSrikanth |   ( Updated:2023-08-26 11:41:31.0  )
నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలో పార్టీనే నిర్ణయిస్తుంది: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర పార్టీల అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్‌లో చేర్చుకునేలా కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్‌ కుట్రలను ముందు బీఆర్ఎస్ అభ్యర్థులు తెలుసుకోవాలని హితవు పలికారు. గవర్నర్‌ను చూసి కేసీఆర్ గజగజ వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యం అని బండి సంజయ్ చెప్పారు.

Advertisement

Next Story