- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఒప్పందాన్ని తాను ముందే చెప్పానని.. దానిని నిజామాబాద్ వేదికగా ప్రధాని మోడీ బహిరంగంగా అంగీకరిచారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి అని మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ-బీఆర్‌ఎస్ ఇరు ప్రభుత్వాలు కలిసి గత పదేళ్లుగా తెలంగాణను నాశనం చేశాయని మండిపడ్డారు. ప్రజలు తెలివైన వారు. వారు ఆడే ఆటను అర్థం చేసుకున్నారు. ఈసారి వారిద్దరినీ తిరస్కరించి 6 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.
తాజాగా.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు బండి కూడా ట్వీట్ పెట్టారు. ఇది మీ తెలివితక్కువతనానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల బంధాన్ని స్పష్టంగా బయటపెట్టారని గుర్తుచేశారు. కర్ణాటక ఎన్నికల వేళ తెర వెనుక చేసుకున్న మీ రహస్య ఒప్పందం బట్టబయలైందని అన్నారు. BRS, కాంగ్రెస్‌కు బ్యాక్ డోర్ ఎంట్రీని ఎలా సులభతరం చేసిందో ఇప్పుడు అందరికీ తెలుసని వెల్లడించారు. తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా ఆక్రమణలకు గురవుతున్న హిందూ దేవాలయాలపై ముందు మీ వైఖరిని స్పష్టంగా చెప్పాలని సవాల్ చేశారు.