- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్టోబర్‌లో టీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా.. ఎవరెవరి పేర్లు ఉంటాయంటే..?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించి ప్రజల్లోకి వెళుతుండగా.. అభ్యర్థుల ఎంపిక కూడా తుది దశకు చేరుకుంది. గత కొద్దిరోజులుగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో కాంగ్రెస్ ఉంది. ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించగా.. వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి వడబోత చేపట్టింది. సర్వేల ఫలితాలు, నియోజకవర్గాల్లో నేతల పనితీరు, సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో రెండు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది.
దాదాపు 80 మంది అభ్యర్థులను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటికి సీల్డ్ కవర్‌లో పంపింది. ఆ జాబితాను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పరిశీలించిన తర్వాత ఆమోదం తెలపనున్నారు. అనంతరం అక్టోబర్‌లో కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించనుందని తెలుస్తోంది. తొలి జాబితాలో సీనియర్ నేతల పేర్లు కూడా ఉండనున్నాయి. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లతో పాటు పలువురు సీనియర్ నేతల పేర్లు ఉండనున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కుమంది సీటు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఎవరికి సీటు ఇవ్వాలో కాంగ్రెస్ తేల్చుకోలేకపోతుంది. అలాంటి స్థానాలపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ నిర్వహించి పీటముడి ఏర్పడిన స్థానాలపై చర్చించి రెండో జాబితాను తయారుచేయనుంది.
ఈ నెల 29న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు స్క్రీనింగ్ కమిటీ పంపిన తొలి జాబితాను పరిశీలించనున్నారు. అనంతరం తొలి జాబితాను విడుదల చేయనున్నారు. అక్టోబర్ తొలివారంలో తొలి జాబితా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. దీంతో చివరి దశలో ఆశావాహులు సీటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఢిల్లీలో మకాం వేసి సీటు కోసం ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కకుమార్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని వారికి టీపీసీసీ ముఖ్యనేతలు సర్దిచెబుతున్నారు.