- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ చదువుకున్న స్కూల్ కట్టించింది కాంగ్రెస్సే: రాహుల్ గాంధీ
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతున్నదని కేసీఆర్కు అర్థమైపోయిందని హస్తం గాలి ముందు కేసీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ కనిపించకుండా పోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారని తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. మీరు చదువుకున్న స్కూల్, కాలేజీ వాటిని కాంగ్రెస్ నిర్మించినవే అనే సంగతి మర్చిపోవద్దన్నారు. ఏ హైదరాబాద్ నగరం ద్వారా వస్తున్న ఆదాయంలో వందల కోట్లు దోచుకుంటున్నారో ఆ హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని ఈ రోడ్డు, మౌళిక సదుపాయాలన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మించినవే అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పినపాక, నర్సంపేట రోడ్ షో లో పాల్గొన్న రాహుల్ గాంధీ కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. పదేళ్లుగా కేసీఆర్ తెలంగాణను దోచుకుంటున్నారని తాము అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్న లక్షల కోట్లను ప్రజల ఖాతాలో జమచేయబోతున్నామన్నారు.
బీఆర్ఎస్ సర్కార్కు అంతం పలికే రోజు వచ్చింది :
ఒక కుటుంబం కోసం తెలంగాణ ఇవ్వలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో తానే స్వయంగా వెళ్లి చూశానని, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. పదేళ్లు తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంతం పలికే రోజు వచ్చిందన్న రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటేనని దుయ్యబట్టారు. ముఖ్యమైన శాఖలన్ని కేసీఆర్ కుటుంబం ఆధీనంలో ఉంచుకుని ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని, కేసీఆర్ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉచిత విద్యుత్ తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నామని రైతులకు హామీ ఇస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కేబినెట్లోనే ఆరు గ్యారెంటీలను అమలు పరుస్తామన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తే తాము పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాన్ని నడపబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో దొరల ప్రభుత్వం పోయి ప్రజల తెలంగాణ రాబోతున్నదన్నారు.