- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్తుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే టాప్.. మొత్తం ఎన్ని కోట్లో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది. దీంతో నేడు భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు రోజుల్లో మొత్తం 2,747 నామినేషన్లు దాఖలయ్యాయి. మంచి ముహూర్తం ఉండడంతో గురువారం ఒక్క రోజే 1,129 దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానిధికారి కార్యాలయం తెలిపింది.
అయితే, ఇదిలా ఉండగా.. గురువారం కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తన పేరిట ఎలాంటి వాహనాలు లేవని పేర్కొన్నారు. ఆస్తుల విలువ రూ.405 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.297,36,37,347.. స్థిరాస్తి విలువ రూ.108,23,40,000గా వెల్లడించారు. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తుల విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో రూ.4.27 కోట్లను ఆస్తులుగా పేర్కొన్న మంత్రి జగదీశ్ రెడ్డి నిలిచారు.