- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాళ్లకు సూపర్ న్యూస్.. తెలంగాణ కాంగ్రెస్ గ్యారంటీల్లో ఇవే హైలైట్!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ శుభవార్త చెప్పింది. ఉద్యమ కారులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 250 గజాల ఇంటిస్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, విద్యార్థులకు రూ.5 లక్షలు విద్యా భరోసా, రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ గవర్నమెంట్ స్కూల్, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.4 వేల ఫించన్, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యభీమా, మహాలక్ష్మి పేరుతో మహిళలకు రూ.2500 సాయం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల సాయం, క్వింటా వరి పంటకు రూ.500 బోనస్, గృహ అవసరాల నిమిత్తం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరీ సభలో సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీలు ఈ గ్యారంటీలను ప్రకటించారు.