BJP ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా.. ఫస్ట్ లిస్ట్ మరింత ఆలస్యం!

by GSrikanth |
BJP ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా.. ఫస్ట్ లిస్ట్ మరింత ఆలస్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఈసారి ఎలాగైనా గెలిచి హాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఎలాగైనా గద్దె దించాలపి విపక్షాలు కాచుకొని కూర్చున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి సిద్ధమవుతుండగా.. అభ్యర్థుల జాబితా విడుదలపై బీజేపీ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టో ప్రకటనలోనూ అన్ని పార్టీల కంటే వెనుకబడింది. వాస్తవానికి కాంగ్రెస్ అనౌన్స్ చేసిన అనంతరం జాబితా ప్రకటిస్తారని తొలుత ప్రచారం జరిగింది.

కానీ, అనుకోని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇదిలా ఉండగా.. ఇవాళ నిర్వహించిన బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కూడా అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో సమావేశం జరిగిన తర్వాతే ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకావం కనిపిస్తోంది. ఇప్పటికే 40 మందితో కూడిన జాబితాను రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి పంపించింది. హైకమాండ్ ఆమోదంతో సమావేశం నిర్వహించి ప్రకటించనున్నారు. అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం అవుతుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. నిన్న కాంగ్రెస్ 55 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయగా.. మిగిలిన సెగ్మెంట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ బీఫాంలు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed