- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రి కేటీఆర్‌కు BIG షాక్.. ఎమ్మెల్యే రాజయ్య యూటర్న్
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తాను కడియం శ్రీహరితో కలవలేదని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజయ్య మీడియాతోయ మాట్లాడుతూ.. ‘‘కడియం శ్రీహరితో నేను కలవలేదు. కేటీఆర్ కోసం ప్రగతిభవన్‌కు వెళ్లాను. అక్కడున్న కడియం, ఎమ్మెల్సీ పల్లాతో కలిసి ఫొటో దిగాను. ఆ ఫొటో వల్ల కార్యకర్తల్లో, నా అనుచరుల్లో ఆందోళన నెలకొంది. బరిలో నిలిచే విషయం కాలమే నిర్ణయిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 17 వరకు నేను ఎమ్మెల్యేలా ఉంటాను’’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా, శనివారం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషిచేస్తానని చెప్పారు. తనకు మద్దతు ప్రకటించడం పట్ల రాజయ్యకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. తీరా 24 గంటలు గడిచే సరికి రాజయ్య యూటర్న్ తీసుకున్నారు. అనూహ్యంగా కడియంకు మద్దతు ప్రకటించలేదని వ్యాఖ్యానించారు. మరి దీనిపై గులాబీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కాగా, వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించిన విషయం తెలిసిందే.