హుజూరాబాద్‌లో జీరో వ్యాపారం..రాజస్థాన్ వ్యాపారుల నకిలీ దందా

by Jakkula Mamatha |
హుజూరాబాద్‌లో జీరో వ్యాపారం..రాజస్థాన్ వ్యాపారుల నకిలీ దందా
X

హుజూరాబాద్‌లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి రాజస్థాన్ వ్యాపారులు నకిలీ దందా చేస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్, శానిటేషన్, ప్లైవుడ్, సెల్ ఫోన్ విడిభాగాలు తదితర వస్తువులను విక్రయిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారులు అంతా జీరో వ్యాపారం నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి తీవ్రంగా గండి కొడుతున్నారు. ఈ దుకాణాల్లో విడిభాగాల వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులకు జీఎస్టీ బిల్లు దేవుడెరుగు కనీసం ఆ దుకాణాల పేరుతో బిల్లులు కూడా రాసి ఇవ్వడం లేదు. కేవలం తెల్ల కాగితంపై వినియోగదారులు తీసుకునే వస్తువులకు బిల్లు వేసి నగదు వసూలు చేస్తున్నారు. రాజస్థాన్ వ్యాపారుల నకిలీ వస్తువుల విక్రయం వల్ల హుజూరాబాద్ ప్రాంతంలో నకిలీ దందా జోరుగా సాగుతోంది. పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్, వరంగల్ రోడ్డు, సూపర్ బజార్ ఏరియా తదితర ప్రాంతాల్లో రాజస్థాన్ వ్యాపారుల పలు దుకాణాలను నిర్వహిస్తున్నారు. వీరంతా ఒక యూనియన్‌గా ఏర్పడి హుజూరాబాద్‌లో నకిలీ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో వినియోగదారులకు నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. దీంతో స్థానిక వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగించలేక పోతున్నారు. ఈ వ్యాపారులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

దిశ,హుజూరాబాద్ రూరల్:హుజూరాబాద్‌లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి రాజస్థాన్ వ్యాపారులు నకిలీ దందా చేస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్, శానిటేషన్, ప్లైవుడ్, సెల్ ఫోన్ విడిభాగాలు తదితర వస్తువులను విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారులు అంతా జీరో వ్యాపారం నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి తీవ్రంగా గండి కొడుతున్నారు. ఈ దుకాణాల్లో ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్, శానిటేషన్, ప్లైవుడ్, సెల్ ఫోన్ విడిభాగాల వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులకు జీఎస్టీ బిల్లు దేవుడెరుగు కనీసం ఆ దుకాణాల పేరుతో బిల్లులు కూడా రాసి ఇవ్వడం లేదు.

కేవలం తెల్ల కాగితంపై వినియోగదారులు తీసుకునే వస్తువులకు బిల్లు వేసి నగదు వసూలు చేస్తున్నారు. రాజస్థాన్ వ్యాపారుల నకిలీ వస్తువుల విక్రయం వల్ల హుజూరాబాద్ ప్రాంతంలో నకిలీ దందా జోరుగా సాగుతోంది. పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్, వరంగల్ రోడ్డు, సూపర్ బజార్ ఏరియా తదితర ప్రాంతాల్లో రాజస్థాన్ వ్యాపారుల ఎలక్ట్రానిక్ హార్డ్వేర్, శానిటేజర్, ప్లైవుడ్ సెల్ ఫోన్ దుకాణాలను నిర్వహిస్తున్నారు. వీరంతా ఒక యూనియన్‌గా ఏర్పడి హుజూరాబాద్‌లో నకిలీ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో వినియోగదారులకు నకిలీ వస్తువులను అంటగడుతున్నారు.

18శాతం జీఎస్టీకి ఎగనామం..

హుజూరాబాద్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్న రాజస్థాన్ వ్యాపారులు స్టేట్ సెంట్రల్ గుడ్ సర్వీస్ టాక్స్‌కు ఎగనామం పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు విక్రయించే వస్తువులకు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ జీఎస్టీలో 9శాతం రాష్ట్రానికి, మరో 9 శాతం కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు ఎగనామం పెట్టి ఢిల్లీ, ముంబాయి నుంచి ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ వస్తువులను దిగుమతి చేసుకొని అందిన కాడికి దండుకుంటున్నారు. హుజూరాబాద్‌లో ఎలక్ట్రానిక్స్‌తోపాటు హార్డ్ వేర్, శానిటైజర్, ఐరన్, ప్లైవుడ్, సెల్ ఫోన్ రంగాల్లో దశాబ్ద కాలం పాటు వ్యాపారాలు నిర్వహించిన వారు స్థానికులు ఆర్థికంగా ఎదగలేక పోతున్నారు.

అయితే ఐదేళ్ల కింద హుజూరాబాద్‌కు వచ్చిన రాజస్థాన్ వ్యాపారులు నకిలీ వస్తువులను విక్రయించి అత్యధికంగా అడ్డగోలుగా లాభాలు అర్జించి స్థానికంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ఒకవైపు నకిలీ వస్తువులు విక్రయిస్తూ మరోవైపు జీరో వ్యాపారం నిర్వహించి ప్రభుత్వ ఆదాయానికి తీవ్రంగా గండి కొడుతున్నారు. అయినప్పటికీ ఈ వ్యాపారులపై చర్యలు తీసుకునే నాధుడే కరువయ్యాడు. కమర్షియల్ టాక్స్ అధికారులు ఈ వ్యవహారంపై కనీసం పట్టించుకోకపోవడం పై పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రాజస్థాన్ వ్యాపారుల నకిలీ దందా పై నిఘా పెట్టి వారి మోసాలను అరికట్టాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు.

Advertisement

Next Story