YS షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్‌లో హైలైట్ ఇదే!

by GSrikanth |
YS షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్‌లో హైలైట్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గండిపేట్ గోల్కొండ రిసార్ట్‌లో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, మాజీ మంత్రి జానారెడ్డిలు పాల్గొన్నారు. మరోవైపు రాజారెడ్డి మేనమామ అయిన ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి హాజరై విషెస్ చెప్పారు. ఈ వేడుకలో ప్రముఖుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్ వేళ ఓ ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. ఈ నిశ్చితార్థ వేడుకలో 150 రకాల వంటకాలు పెట్టినట్లు సమాచారం. ఆంధ్రా, తెలంగాణ రుచులతో పాటు విదేశీ అతిథులకు ప్రత్యేక వంటకాలు చేయించారని తెలుస్తోంది. నిశ్చిర్థాన్నే ఇంత గ్రాండ్‌గా జరిపితే పెళ్లి వేడుకను ఎలా ప్లాన్ చేశారో అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed