మీరూ మాతో చేతులు కలపండి.. అసద్‌కు YS షర్మిల లేఖ

by GSrikanth |
మీరూ మాతో చేతులు కలపండి.. అసద్‌కు YS షర్మిల లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 17వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న టీ-సేవ్ ఫోరమ్ నిరాహారదీక్షకు ఎంఐఎం మద్దతు తెలపాలని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అసదుద్దీన్ ఓవైసీకి మంగళవారం లేఖ రాసింది. నిరుద్యోగుల తరుపున చేపడుతున్న పోరాటానికి ఎంఐఎం నేతలు కూడా చేతులు కలపాలని లేఖలో కోరింది. నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై పోరాటం చేయడం చారిత్రక అవసరంగా ఆమె లేఖలో పేర్కొంది. ముఖ్యమంత్రి మెడలు వంచుదామని వెల్లడించింది. ముస్లిలంకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం మోసం చేశారని ఆమె లేఖలో గుర్తుచేశారు. ప్రస్తుతం మైనార్టీలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను కూడా తన తండ్రి వైఎస్సార్ హయాంలో అమలు చేసిందేనని షర్మిల లేఖలో స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలకు దిక్కులేదని, అలాంటిది దొర.. పక్క రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాక్టరీలను కాపాడే పనిలో పడ్డాడని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. రాష్ట్ర సొమ్ముతో పెట్టుబడులు పెట్టి ప్రైవేటీకరణ కాకుండా ఆపుతాననడం సిగ్గుచేటని షర్మిల ధ్వజమెత్తారు. కేసీఆర్ ఒక చేతకాని దద్దమ్మ అని మండిపడ్డారు. రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతేందో దొర సమాధానం చెప్పాలని షర్మిల ప్రశ్నించారు. ఇక్కడ రోడ్డున పడిన వేలాది కార్మికుల కుటుంబాలు కేసీఆర్ కు కనిపించడంలేదా అని ఆమె నిలదీశారు. కేసీఆర్‌కు దమ్ముంటే రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని, ఆపై కేంద్రం మెడలు వంచి బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed