420 కేసీఆర్ కూడా జైలుకు పోవడం ఖాయం: YS షర్మిల ఫైర్

by Satheesh |
420 కేసీఆర్ కూడా జైలుకు పోవడం ఖాయం: YS షర్మిల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీ చెల్లి నిర్దోషి అయితే.. మొత్తం లిక్కర్ దందాలో ఏం జరిగిందో చెప్పు? అని మంత్రి కేటీఆర్‌ను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. దొంగలు ఎవర్రా అంటే భుజాలు తడుముకునట్లు మంత్రి కేటీఆర్ ప్రెస్‌మీట్ ఉందని విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఏ తప్పూ చేయకుంటే "ఈడీ, బోడీ"లకు భయమెందుకు? అని ప్రశ్నించారు. కేంద్రం చేతిలో ఈడీ తోలుబొమ్మ అయితే.. కేసీఆర్ సర్కారు చేతిలో పోలీసు శాఖ కీలుబొమ్మ కాదా? అని నిలదీశారు. వాస్తవాలు బయటకు చెప్పే మీడియాపై చిన్నదొరకు ఎందుకు అంత అసహనం? అని పేర్కొన్నారు.

సొంత మీడియాను జనం నమ్మడం లేదనా? అని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాపాలపుట్ట పగులుతోందని, సీఎం నేరాల చిట్టా నాగుపామై కాటేసే రోజు దగ్గరలో ఉందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతిపై ఢిల్లీలో కాగ్‌ని కలిసి ఆధారాలతో అందించిన ఫిర్యాదుకు.. మా అవిశ్రాంత పోరాటానికి ఫలితం షురూ అవుతుందన్నారు. ఇక కేసీఆర్ సర్కార్ పతనం పెండింగ్‌లో ఉందని, 420 కేసీఆర్ కూడా జైలుకు పోవడం ఖాయమన్నారు.

Advertisement

Next Story