- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కాంపై ఓ రివ్యూ లేదు, మీటింగ్ లేదు.. అంగట్లో సరుకుల్లా పేపర్ల అమ్మకం: వైఎస్ షర్మిల
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ అంగట్లో సరుకులు అమ్ముతున్నట్లు...క్వశ్చన్ పేపర్లు అమ్మకానికి పెట్టిన సర్కారుకు సిగ్గురాదని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు, ఇప్పుడు పేపర్ లీకేజీలతో వారి కష్టార్జితం నీటిపాలైనా కూడా దొర గారికి దున్నపోతు మీద వానపడ్డట్టే అవుతోందని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం షర్మిల ట్వీట్ చేశారు. టీఎస్‌పీఎస్సీ స్కాం జరిగి, నెలన్నర దాటుతున్నా..ఇప్పటివరకు ఒక్క రివ్యూ, మీటింగ్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగుల పక్షాన గళమెత్తితే పిరికిపందలా హౌజ్ అరెస్ట్ చేయించడం మాత్రం కేసీఆర్‌కి చేతనైందని ఎద్దేవా చేశారు. స్కాంపై చర్యలు లేకుండా పరీక్షలు నిర్వహించడంపై ఆమె మండిపడ్డారు. మళ్లీ క్వశ్చన్ పేపర్లు అమ్మి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా ఉన్నట్లుందని ఆరోపించారు. ఈ సందర్భంగా వెంటనే టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల మీద కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే..ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించి, ఎంతటి దోషులనైనా కఠినంగా శిక్షించాలని కోరారు.