పోడు పట్టాల పంపిణీ వెనుక కేసీఆర్ దురాలోచన: షర్మిల

by GSrikanth |   ( Updated:2023-06-30 12:46:15.0  )
పోడు పట్టాల పంపిణీ వెనుక కేసీఆర్ దురాలోచన: షర్మిల
X

దిశ, డైనమిక్ బ్యూరో: 25 శాతం రైతులకు మాత్రమే పోడు పట్టాలిచ్చి, మిగిలిన రైతులకు ఎగనామం పెట్టడమే సీఎం కేసీఆర్ దురాలోచన అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇన్నాళ్లు పోడు రైతులను కొట్టి, హింసించి, జైల్లో వేసిన దొరకి ఓట్ల పండుగ దగ్గరకు రాగానే మళ్లీ పోడు రైతులు గుర్తువచ్చారని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో 8 సార్లు పోడు పట్టాలు ఇస్తానని ప్రకటించి పోడు రైతులను నిండా ముంచారన్నారు. ఊరించి ఊరించి కొసరేసినట్లు కొంతమందికే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 12.50 లక్షల ఎకరాల్లో పోడు భూములు ఉన్నాయని స్వయంగా అధికారులే లెక్కలు బయట పెడితే.. ఆ కాగితాలను చింపేసి 4.05 లక్షల ఎకరాలే పోడు పట్టాలు అని సొంత లెక్కలు బయటపెట్టారని వివరించారు. పోడు రైతులపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే.. నాలుక మీద నరమే ఉంటే ఇచ్చిన హామీ ప్రకారం 12.50లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

Also Read..

‘కరప్షన్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కరప్షన్’

Advertisement

Next Story

Most Viewed