- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : మీ మాటలు అబద్ధం.. మీ చేతలు అబద్ధం : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల లెక్కలను ఎక్కువ చేసి చెబుతూ బీఆర్ఎస్ పాలనపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు అబద్ధం..చేతలు అబద్ధమని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా? అని ప్రశ్నించారు. అర్ధసత్యాలు..అభూతకల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని, కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా? అని నిలదీశారు.
50 వేల కోట్లు, 65 వేల కోట్లు వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసమని ప్రశ్నించారు. ఆర్భీఐ హ్యాండ్ బుక్(RBI Handbook of India States)లెక్కలు మేరకు తెలంగాణ అప్పు ఎంత ఉందో తేటతెల్లమవుతోందన్నారు. ఢిల్లీకి మూటలు మోసేందుకా? నీ జేబు నింపుకునేందుకా? అబద్ధానికి అంగు లాగీ వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారని మండిపడ్డారు.