- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆయనకేంది భయపడేది’.. ఆ స్టార్ హీరోపై నయనతార సంచలన కామెంట్స్(వీడియో)
దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా తన సత్తా చాటింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంటుంది. ఇక డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. అయితే సరోగసి ద్వారా ఈ జంట ఇద్దరు బాబులకు పేరెంట్స్ కూడా అయ్యారు. ప్రస్తుతం ఈ భామ ఓ పక్కా సినిమాలు, మరోపక్క తన భర్త, పిల్లలతో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా నయన్.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో వివాదానికి దిగిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ కోసం నయన్ చేసిన డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ‘నేను రౌడీనే’ అనే చిత్రం నుండి కొన్ని సీన్స్ తనకి చెప్పకుండా తీసుకున్నందుకు వీరి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అయితే ఈ వివాదం పై హీరోయిన్ నయనతార స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్‌ను యాంకర్.. “అసలు ఈ విషయంపై ధనుష్‌కి అంత ధైర్యంగా లేఖ ఎలా రిలీజ్ చేశారు” అని అడిగితే.. దానికి ఆమె స్పందిస్తూ.. “నేనేమీ తప్పు చేయలేదు. నేను చేసింది రైట్ అని నాకు తెలిసినప్పుడు ఎవరికో ఎందుకు భయపడాలి. నిజానికి ధనుష్ మా ఫ్రెండ్ అని అనుకున్నా అందుకే ఎన్ వో సీ అడిగాను. కానీ, తను స్పందించలేదు. అందుకే ధనుష్‌ను కలవాలి అనుకున్నాం. అయితే అది కూడా కుదరలేదు.
ఇక ధనుష్ ఈ సినిమాలోని సీన్లు వాడుకోవడానికి అస్సలు కుదరదు అన్నారు. కనీసం ఓ నాలుగు లైన్లు వాడుకుంటామని అన్నాను. దానికి కూడా అతను ఒప్పుకోలేదు. కానీ బిహైండ్ ది సీన్స్ అవి మా పర్సనల్. మా జీవితంలో ఆ సీన్స్ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అది ధనుష్ అర్థం చేసుకుంటాడని అనుకున్నాం. ఇప్పుడు బిహైండ్ ది సీన్స్ కూడా తీసుకున్నందుకు గొడవ. దీన్ని మాట్లాడి పరిష్కరించుకోవాలని అనుకున్నా. కానీ జరగలేదు’ అని నయన్ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.