సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది: హరీష్ రావు

by Mahesh |
సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది: హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ.. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. కాగా ఈ నిరాహార దీక్షకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కి పొద్దుగాల చాయి ఇచ్చేవారు ఆయన ఇచ్చిన హామీలను ఒకసారి గుర్తు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తాను అన్నాడని గుర్తు చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. వారి రెగ్యులరైజేషన్ కోసం బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 15% విద్యా శాఖకు బడ్జెట్ పెడతామని చెప్పి.. ఇప్పుడు 7% బడ్జెట్ కూడా పెట్టలేదని.. వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడిద్దామని ఈ సందర్భంగా హారీశ్ రావు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed