MRPS:కేసీఆర్ బిడ్డ రూపమే తెలంగాణ తల్లి.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
MRPS:కేసీఆర్ బిడ్డ రూపమే తెలంగాణ తల్లి.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ తల్లి(Telangana Thalli) కేసీఆర్(KCR) బిడ్డ కవిత(Kalvakuntla kavitha) రూపంలోనే ఉందని , తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం ఉంది.. కవితకు లేవు అంతే తేడా అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు(MRPS President) మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్(Hyderabad Press Club) లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి పేరుతో తల్లుల పేరుతో విగ్రహాలు వచ్చాయని, గతంలో కేసీఆర్ బిడ్డ కవిత రూపమే తెలంగాణ తల్లి అయిందని ఆరోపించారు. దీనిపై మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కవిత మాట్లాడుతూ.. నేను తెలంగాణ బిడ్డనే కదా, అందుకే తెలంగాణ తల్లి నా రూపంలో ఉండవచ్చు అని చెప్పినట్లు గుర్తు చేశారు.

అంతేగాక అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eashwar), తన నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని దానికి కవితను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని అన్నారు. అప్పుడు విగ్రహావిష్కరణకు వచ్చిన కవిత చీర రంగు.. తెలంగాణ తల్లి విగ్రహం చీర రంగు ఒకటేనని చెప్పారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి ఏ రంగు జాకెట్ ఉందో.. కవిత వేసుకున్న జాకెట్ కూడా అదే కలర్ ఉందని, విగ్రహానికి ఉన్న జాకెట్ అంచు ఏ కలర్ లో ఉన్నదొ.. కవిత జాకెట్ అంచు అదే కలర్ లో ఉన్నదని, ఆ విగ్రహం చీర అంచుకు ఏ కలర్ ఉన్నదో.. అదే రంగు అంచు ఉన్న చీరను కవిత కట్టుకున్నదని తెలిపారు. కవిత రూపంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసినట్లు ఉందని, ఆ విగ్రహానికి కిరీటం, వడ్డాణం ఉన్నాయని, కవితకు లేవు అంతే అని మందకృష్ణ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed