Vidudala-2: సామాన్యుల నుంచి ఉద్భవించిన కథే ఈ చిత్రం.. విజయ్ సినిమాపై హైప్ పెంచేస్తున్న నిర్మాత

by sudharani |
Vidudala-2: సామాన్యుల నుంచి ఉద్భవించిన కథే ఈ చిత్రం.. విజయ్ సినిమాపై హైప్ పెంచేస్తున్న నిర్మాత
X

దిశ, సినిమా: విజయ్ సేతుపతి (Vijay Sethupathi), వెట్రీమారన్‌ (Vetrimaran) కాంబోలో వచ్చిన ‘విడుదల-1’ (Vidudala-1) చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ ((sequel)) గా ‘విడుదల-2’ (Vidudala-2) డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు (Chinthapalli RamaRao) దక్కించుకోగా.. తాజాగా మీడియా (media) సమావేశం ఏర్పాటు చేసి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే ‘విడుదల-2’ కథ. ఇది తమిళ (Tamil) చిత్రం కాదు. తెలుగు (Telugu) రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. ఈ చిత్రంలో పెరుమాళ్‌ (Perumal) పాత్రకు సేతుపతి నూటికి నూరు శాతం సరిపోయాడు. నక్సెలైట్‌ (Naxalite) పాత్రలో విజయ్‌ సేతుపతి నటన, పాత్రలోని ఎమోషన్‌ (emotion) ఆయన పండించిన విధానం అద్భుతం. ఏడు సార్లు నేషనల్‌ అవార్డు (National Award) అందుకున్న వెట్రీమారన్‌ దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్రహీరోలదరూ ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. ఇందులో కొన్ని సన్నివేశాలు అందర్ని కంటతడిపెట్టిస్తాయి. డిసెంబర్‌ 20న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధిస్తుంది’ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed