- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tech Life : జీవించే విధానాన్ని, నేర్చుకునే పద్ధతులను మార్చేసిన టెక్నాలజీ!
దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ.. ప్రస్తుతం మన జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. అనేక మార్పులకు కారణమైంది. నేర్చుకునే సామర్థ్యం నుంచి ఈచ్ టు అదర్ ఇంటరాక్షన్స్ వరకు కీ రోల్ పోషిస్తోంది. ఒక విషయంలో టైమ్ స్పెండ్ చేయడం నుంచి మనం రిలాక్స్ అవడం వరకు జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే సాంకేతికత మనం జీవించే విధానాన్నే మార్చేసిందని నిపుణులు చెబుతున్నారు. అయితే కల్పనల నుంచి వాస్తవాలను, వాస్తవాల నుంచి కల్పనలను వేరు చేసినట్లు టెక్నాలజీని కూడా ఆ కోణంలో పరిశీలించినప్పుడు అనుకూలతలతో పాటు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అలాంటి విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ సెర్చింగ్
నిజం చెప్పాలంటే ఇంటర్నెట్ మానవ జీవితంలోని ప్రతీ విషయంలో మార్పులకు కారణమైంది. గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్‌ల ఆధారంగా ప్రస్తుతం మనం కోరుకునే ప్రతీ సమాచారం మన చేతి వేలికొనల దూరంలోనే ఉంటోంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా క్షణాల్లో పొందగులుగుతున్నాం.1998లో గూగుల్ సెర్చ్‌లను మొదటిసారిగా ప్రారంభించినప్పుడు సగటను రోజుకు 10 వేల సెర్చింగ్‌లు జరిగాయి. ఇప్పుడు ఆ సంఖ్య రోజుకు 3.5 బిలియన్లకు చేరింది.
మెమోరీ పవర్
మీరు చివరిసారిగా ఎవరిఫోన్ నెంబర్‌ను గుర్తు పెట్టుకున్నారు? చాలా వరకు గుర్తుండదు. అలాగే ఏదైనా టైప్ చేసేటప్పుడు పొడవైన వాక్యమో, మ్యాటరో అయితే తప్పులు పోతుంటాయి. ఓవర్ లుక్‌లో గుర్తించడం చాలా కష్టం. కానీ ఈ రెండు విషయాల్లోనూ టెక్నాలజీ చాలా మార్పు తెచ్చింది. ఫోన్ నెంబర్లు మనం గుర్తు పెట్టుకోకపోయినా అవసరమైనప్పుడు యూజ్ చేసుకునేలా సెల్ ఫోన్‌లో ఫీడ్ చేసుకుంటున్నాం కదా. అలాగే ఆటోకరెక్ట్ టెక్నాలజీ ద్వారా మనం టైప్ చేస్తుండగానే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వెంటనే అలర్ట్ చేస్తుంది. కరెక్ట్ కూడా చేస్తుంది. ఎలా సాధ్యమైంది? అంటే ఓన్లీ టెక్నాలజీ. ఇక మెమోరీ కోసం టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్ తరాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఎక్స్‌టర్నల్(external)హార్ట్ డ్రైవ్. పరిశోధకులు ఈ విషయాన్ని ‘‘ కాగ్నెటివ్ ఆఫ్ లోడింగ్ (cognitive offloading)’’అని పిలుస్తారు. మన జ్ఞాపకాలను భద్ర పరించేందుకు ఉపయోగించే బాహ్య పరికాలను ఉపయోగించినప్పుడు ఇది వర్తిస్తుంది.
రీడింగ్ అండ్ లెర్నింగ్
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఇ-బుక్స్ లేదా రీడర్లన ఉపయోగించడం ద్వారా ప్రజలు గతంకంటే ఇప్పుడు ఎక్కువగా చదువుతున్నారు. అయితే రీడింగ్ విధానం మారిపోయింది. మొబైల్ ఫోన్‌లోనూ చదువుతున్నాం. అయితే పుస్తకాలు చదివినట్లు మాత్రం ఉండదు. ఇక్కడ కంటెంట్‌ను తగ్గించే అకాశం ఉంది. మరింత సమాచారం కావాలన్నప్పుడు దాని లోతుల గురించి ఆలోచించడం లేదు. ఒక అధ్యయనం ప్రకారం.. అసలు పుస్తకాలను నేరుగా చదివే వ్యక్తులు, అదే సమాచారాన్ని డిజిటల్ టెక్నాలజీ లేదా డివైస్‌లలో చదివే వారికంటే ఎక్కువ సమాచారాన్ని, జ్ఞనాన్ని కలిగి ఉంటున్నారు. బాగా గుర్తుంచుకోవడంలో, లోతైన విషయ పరిజ్ఞానానికి, గుర్తుంచుకోవడానికి పుస్తకాలు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
సామాజిక నైపుణ్యాలు
తరచుగా ఒక స్థిరమైన పరకరం వినియోగించడం, మొబైల్ ఫోన్‌లోనో, ల్యాప్ టాప్‌లోనో మునిగిపోవడం, తరచుగా సోషల్ మీడియాలో గడపడం మన సామాజిక నైపుణ్యాలను, సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళనలు ఇప్పటికే వ్యక్తం అవుతన్నాయి. ఐదు రోజులపాటు తమ టెక్నాలజీ డివైసెస్ నుంచి వేరు చేయబడినప్పుడు, పరస్పరం మాట్లాడుకోవడం, తరచుగా ఇంటరాక్ట్ అవడం కారణంగా విద్యార్థులు తమ భావోద్వేగ, సామాజిక మేధస్సులో మెరుగుదల సాధించారని ఒక అధ్యయనం పేర్కొన్నది.
సెర్చ్ ఇంజిన్ ఉపయోగాలు
ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి లేదా సమాచారాన్ని అందించడానికి సెర్చ్ ఇంజిన్‌లపై ఆధారపడే వ్యక్తులు తమ తెలివితేటలను ఎక్కువగా అంచనా వేసే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే వేరియస్ లెర్నింగ్ స్టైల్స్, లెర్నింగ్ మీడయమ్స్ ఆన్‌లైన్ మాద్యమాల ద్వారా లభ్యం అవుతున్నాయి. పిల్లలు ఏదైనా తెలుసుకోవడానికి పుస్తకాన్ని లేదా మాన్యువల్‌ని తక్కువ నివిడిలోనూ, వీడియో రూపంలోనూ వీక్షించే అవకాశం టెక్నాలజీలో ఉంది. అలాగే గూగుల్ సమాధానాలను అందించే సౌలభ్యం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని విశ్వసించేలా చేస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు సరైన సమాచారం లేకున్నా గుర్తించలేకపోతాం. భ్రమలకు లోనవుతాం. దీంతో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కచ్చితత్వంతో మూల్యాంకనం చేయడానికి బదులు, గూగుల్ యూజర్స్ యథాతథంగా అంగీకరించి ముందుకు సాగడానికి అవకాశం ఉంది.
టెక్నాలజీ పర్యవసనాలు
పరికరాలు, సెర్చ్ ఇంజిన్‌ల సహాయంపై ఆధారపడటం మన జీవితాలను సులభతరం చేస్తుంది. అయితే అదే సందర్భంలో మన దృష్టి, జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రతికూలతలు ఉంటున్నాయి. కాగ్నిటివ్ ఆఫ్ లోడింగ్ (Cognitive offloading) పర్యవసనాలు ఏమిటంటే.. నిజ జీవిత అనుభవాలను మనం పెద్దగా గుర్తుంచుకోవడం లేదు. వాటిని టెక్నాలజీలో బందిస్తూ అవసరం అయినప్పుడు చూసుకుంటున్నాం. అలాగే గూగుల్‌లో ఏదైనా సరే నిమిషాల్లో రీసెర్చ్ చేయగలుగుతున్నాం.. కానీ దీనివల్ల మనం లోతైన దృష్టిని, ఆలోచనా సామర్థ్యాన్ని కోల్పోతున్నామని నిపుణులు సైతం నమ్ముతున్నారు. ఆన్‌లైన్ సమాచారం కోసం నిరంతరం కుస్తీ పడుతున్నప్పటికీ చాలా విషయాలను పైపైనే అధ్యయనం చేస్తామని, దీనివల్ల లాంగ్ టెర్మ్ మెమోరీ పవర్‌ను బదిలీ చేసే సామర్థ్యాన్ని, క్రియేటివిటీని కోల్పోతామని నిపుణులు చెబుతున్నారు. కాగా మల్టీ టాస్కింగ్ విషయంలో మాత్రం బాగానే ఉండవచ్చు.
Read More...
Viral : రాళ్లను ముద్దాడితే పెళ్లి..! నగ్నంగా పరుగెడితే అదృష్టం!!