MLA: ఆయన బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం..

by Gantepaka Srikanth |
MLA: ఆయన బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం..
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ(BJP) ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు(Vishnu Kumar Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ(YCP) రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడటం అనైతికం అని అన్నారు. వాళ్లను నమ్మి జగన్(Jagan) పదవులు ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు అనుభవించి.. ఇప్పుడు పవర్‌లో లేకపోయేసరికి పార్టీ మారటం అనైతికం అని విష్ణుకుమార్ రాజు అన్నారు. వైసీపీని వీడిన వారిలో ఒకరు మా పార్టీలో కూడా చేరారని అన్నారు. ఒక పదవికి రాజీనామా చేసి.. మళ్లీ అదే పదవి కోసం మరో పార్టీలో చేరడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా వారి రాజీనామాలు సరైనవే కావచ్చు. నైతికంగా ఇది మంచి పరిణామం కాదని చెప్పారు. అవంతి శ్రీనివాస్(Avanthi Srinivas) బీజేపీలోకి వస్తానంటే స్వాగతిస్తామని అన్నారు.

ఇదిలా ఉండగా.. వైఎస్సార్‌సీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఈ మేరకు అధిష్టానానికి రాజీనామా చేసినట్లు లేఖను పంపించారు. వ్యక్తిగత కారణాలతో వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు లేఖలో రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పుకుంటున్నానని లేఖలో రాశారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ రాజీనామాను ఆమోదించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed