- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు : కలెక్టర్
దిశ, హనుమకొండ : ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి సందేహాలు నివృత్తి చేసేందుకు, ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించిన వివరాల కోసం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1800425115 ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ అన్ని పని దినాలలో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ టోల్ ఫ్రీ నెంబర్ పని చేస్తుందన్నారు. ఇందుకుగాను 2బి హెచ్ కె జిల్లా నోడల్ అధికారులుగా శ్రీనివాసులు, 2బి హెచ్ కె మేనేజర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్ రమాదేవి సందేహాలను నివృత్తి చేస్తారని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు.