Game Changer: ఆ సినిమా నాకెంతో ప్రత్యేకం.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by sudharani |
Game Changer: ఆ సినిమా నాకెంతో ప్రత్యేకం.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) ప్రజెంట్ ‘గేమ్ చేంజర్’ (Game Changer) చిత్రంతో బిజీగా ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ (Srikanth), అంజలి (Anjali), నవీన్ చంద్ర (Naveen Chandra), ఎస్.జె సూర్య (SJ Surya) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ (Political Action) అండ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ 2025 సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొన్న ఈ బ్యూటీ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (Interesting comments) చేసింది.

‘రామ్ చరణ్, శంకర్, తమన్‌లతో వర్క్ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. ‘గేమ్ చేంజర్’ షూటింగ్ మూడేళ్ల నుంచి జరుగుతోంది. ఈ సినిమాను ప్రేక్షకుల మందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందంతో పాటు నేను కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ నాకు వర్క్ పరంగానే కాదు పర్శనల్‌గా కూడా ఎంతో స్పెషల్. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ టైంలో నేను పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాను. అంతే కాదు ఈ మూడేళ్లలో నేను నటించిన ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed