- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala News : తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి(Tirumala Tirupathi)లో నేడు చక్రతీర్థ ముక్కోటి (Chakratirtha Mukkoti) గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకుని చక్రత్తాళ్వారు, నరసింహస్వామి, ఆంజనేయ స్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం చేపట్టి హారతి ఇచ్చారు. స్కంద పురాణం ప్రకారం.. పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేయగా మహావిష్ణువు ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేసిన పద్మనాభ మహర్షిని ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి స్వామివారిని ప్రార్థించాడు. స్వామి ప్రత్యక్షమై తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అనంతరం ఆ మహర్షి సుదర్శన చక్రాన్ని ఇక్కడే ఉంచి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరడంతో తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉంచడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచిందని అర్చకులు వెల్లడించారు.
- Tags
- Tirumala News