గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

by Sridhar Babu |
గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
X

దిశ, మేడిపల్లి : గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. బోడుప్పల్ లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి ఈ నిందితుడిని అరెస్టు చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘట్కేసర్ ఎక్సైజ్​ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జూప్పల్లి రవి తెలిపిన వివరాల ప్రకారం ఎక్సైజ్​ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ ఆదేశాల మేరకు బోడుప్పల్ లో వీరేంద్ర అనే వ్యక్తి బీహార్ నుండి గంజాయి చాక్లెట్లు తెచ్చి అమ్ముతున్నాడని పక్కా సమాచారంతో ఘట్ కేసర్ లిమిట్ బి బృందం బుధవారం బోడుప్పల్ లో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందుతుని నుండి 4.9 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని నిందితున్ని తదుపరి విచారణ కోసం ఘట్ కేసర్ ఎస్ హెచ్ ఓ కు అప్పగించారు. అనంతరం గురువారం నిందితున్ని రిమాండ్ కు తరలించామని సీఐ రవి తెలిపారు.

Advertisement

Next Story