వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలి

by Sridhar Babu |
వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలి
X

దిశ, కొత్తగూడెం : వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యనభ్యసించే విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న మెనూను సవరించి 40 శాతం పెంచి ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా జిల్లాలోని బీసీ సంక్షేమ వసతిగృహాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు పెరిగిన డైట్ చార్జీల ప్రకారం మెనూను, నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రత్యేక చర్యలలో భాగంగా గురువారం పాల్వంచలోని బీసీ వసతి గృహంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లాలోని బీసీ వసతిగృహ సంక్షేమాధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించి మాట్లాడారు. బీసీ వసతిగృహంలో ఆహారం కలుషితం కాకుండా ఉండేందుకు పాటించాల్సిన నియమాలు, తాగు నీరు, పరిశుభ్రమైన ఆహారం, కిచెన్ గార్డెన్లో మునగ, చింత, కరివేపాకు, పనస, వెలగ, ఉసిరి వేయాలని అన్నారు. కిచెన్ పరిశుభ్రత, ఆహార ధాన్యాల నిల్వ, విద్యార్థులతో ఫుడ్ సేఫ్టీ కమిటీలు, పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, విద్యార్థులకు కౌంట్ డౌన్ చార్ట్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సమయ నిర్ధేశం చేయాలని కోరారు. ఈ విద్యా సంవత్సరంలో మేరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఇందిర పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed