Raja Singh: మీరు తప్పు చేశారు.. మోహన్‌బాబుకు ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచనలు

by Ramesh N |
Raja Singh: మీరు తప్పు చేశారు.. మోహన్‌బాబుకు ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీనియర్ నటుడు మోహన్ బాబు జర్నలిస్టు దాడి ఘటనపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక వీడియో విడుదల చేశారు. మోహన్ బాబు ఫ్యామీలి గొడవల్లో వారి కొడుకు మీడియాను పిలవడం వల్లే హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారని తెలిపారు. మోహన్ బాబు మీ కుటుంబ సమస్య మీ ఇంటివరకే ఉంటే బాగుంటుంది.. అని సూచనలు చేశారు. కానీ ఇంటి సమస్యను పబ్లిక్‌లో పెట్టారని చెప్పారు. వాస్తవం ఏముందో ప్రజల ముందు తీసుకుపోవడానికి మీడియా ప్రయత్నించిందన్నారు.

ఏపార్టీకి సపోర్ట్‌గా మీడియా ఉండదని అన్నారు. ఇష్యూని ఇలాగే వదిలేస్తే మరింత పెద్దది అవుతుందన్నారు. మీరు తప్పు చేశారు.. క్షమాపణ చెప్తే బాగుంటుందని తెలిపారు. మీరు మీడియాకి క్షమాపణలు చెప్పి, గాయపడిన జర్నలిస్టుని పరామర్శించడం మంచిదని సూచనలు చేశారు. ఎందుకంటే మీడియా హీరోని జీరో కూడా చేయగలదని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed