Akhil- Zainab: అయ్యగారి పక్కన అమ్మగారు.. ఏమున్నార్రా బాబు అంటున్న నెటిజన్లు

by Kavitha |
Akhil- Zainab: అయ్యగారి పక్కన అమ్మగారు.. ఏమున్నార్రా బాబు అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా అనిపించుకున్న అక్కినేని అఖిల్ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌కి చెందిన ఓ బడా పారిశ్రామిక వేత్త కూతురు అయినటువంటి జైనాబ్ రవడ్జీతో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉంటూ.. నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున అఖిల్- జైనాబ్‌ల ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేస్తూ.. ‘ మా కోడలు జైనాబ్ రావడ్జీ, మా కొడుకు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ అమ్మాయిని మా కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా హ్యాపీగా ఉంది.. మీరు ఈ యువ జంటను ఆశీర్వదించండి’ అని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఇక అప్పటి నుంచి అఖిల్- జైనాబ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయారు. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న పిక్‌లో.. అక్కినేని అఖిల్ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో, జైనాబ్ మెరూన్ డిజైనర్ డ్రెస్‌లో కనిపించారు. ఇద్దరు ఇలా ఒకే ఫ్రేమ్‌లో చాలా చూడముచ్చటగా కనిపించారు. అయితే ఈ పిక్.. చైతన్య- శోభితల పెళ్లి వేడుకల్లోది అని తెలుస్తోంది. కాగా నాగ చైతన్య - శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖిల్- జైనాబ్ రవడ్జీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు, అక్కినేని అభిమానులు.. అయ్యగారి పక్కన అమ్మగారు ఇది కదా జంట అంటే అని, ఒకే ఫ్రేమ్‌లో ఏమున్నార్రా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed