- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛత్తీస్గడ్లో ఎన్ఐఏ అధికారుల సోదాలు
దిశ, చర్ల : ఛత్తీస్గడ్ రాష్ట్రం సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు సోదాలు నిర్వహించారు. మొదట సుక్మా జిల్లాకు చేరుకున్న ఎన్ఐఏ అధికారులు మావోయిస్టుల కేసులో సభ్యురాలిగా ఉన్న ఓ ఉపాధ్యాయురాలిని విచారించారు. అనంతరం గత అసెంబ్లీ ఎన్నికల్లో హత్యకు గురైన బీజేపీ ఉపాధ్యక్షుడు రతన్ దూబే హత్యపై విచారణ చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రత వలయం నడుమ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్ను నేతమ్ ను మరికొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులను ఎన్ఐఏ అధికారులు విచారించినట్లు తెలిపారు.
మొత్తం 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పలువురు అనుమానితులను, మావోయిస్టుల సానుభూతి పరులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సర్పంచులను సైతం స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించి విచారించినట్లు తెలిసింది. ఈ విచారణలో మావోయిస్టులకు చెందిన ప్రచార కరపత్రాలతో పాటు మావోయిస్టుల సాహిత్యాలు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కొంత నగదు సైతం స్వాధీనం చేసుకుని ఈ కేసులో నిందితుడిపై చార్జ్ షీటు దాఖలు చేసినట్లు తెలిపారు.
బీజాపూర్ లో ఎన్ఐఏ అధికారుల సోదాలు
బీజాపూర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల గంగులూరు పోలీసు స్టేషన్ పరిధిలోని పలనార్ గ్రామంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డ్, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.