T.Congress: పార్టీని చంపేయాలని చూస్తున్నారు.. సొంత నేతలపై జగ్గారెడ్డి ఫైర్

by Gantepaka Srikanth |
T.Congress: పార్టీని చంపేయాలని చూస్తున్నారు.. సొంత నేతలపై జగ్గారెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత నేతలపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ(AICC) కార్యదర్శి విష్ణు(Vishnu), దీపాదాస్ మున్షి(Deepa Das Munshi) మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లం అయిన తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కొత్త వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే విషయం ఫైనల్ అయ్యే వరకు తమకు సమాచారం ఇవ్వరా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని.. ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేసిన వారిని ఎవరు పట్టించుకోవాలని అడిగారు. అసలు విష్ణు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్లిపోయారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

మెదక్‌(Medak) జిల్లా కూడా నేనే చూస్తున్నానన్న విష్ణు ఎక్కడికి వెళ్లారని అడిగారు. దీపాదాస్‌ కూడా తెలంగాణ రాష్ట్రానికే పనిచేస్తున్నారా? లేక వేరే రాష్ట్రం వెళ్లిపోయారా? అని రెచ్చిపోయారు. అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి.. అసలు మీరేం చేస్తున్నారో అర్థం అవుతుందా? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే.. ఇది కేవలం జగ్గారెడ్డి అభిప్రాయం మాత్రమేనా? పార్టీలో మరికొంత మంది కూడా ఇదే రకమైన అసంతృప్తిలో ఉన్నారా? అనేది కూడా తేలాల్సిన అవసరం ఉన్నది.

Advertisement

Next Story