- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > అనంతపురం > విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం: తల్లి మృతి, పిల్లల పరిస్థితి విషమం
విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం: తల్లి మృతి, పిల్లల పరిస్థితి విషమం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గార్ల దిన్నెకు చెందిన కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి, కుమార్తె, కుమారుడు విషగుళికలు మింగారు. అయితే తల్లి మృతి చెందారు. కుమార్తె, కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు. మృతురాలు సుజాతగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఇద్దరు పిల్లలకు అనంతపురం ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. కుటుంబ సమస్యలుంటే తమను ఆశ్రయించాలని, పరిష్కారం చూపుతామని, క్షణికావేశంలో ప్రాణాలు పొగొట్టుకోవద్దని పోలీసులు సూచించారు.
Next Story