ఏసీబీ కస్టడీకి ఇరిగేషన్‌ ఏఈఈ నిఖేష్‌ కుమార్‌

by Mahesh |
ఏసీబీ కస్టడీకి ఇరిగేషన్‌ ఏఈఈ నిఖేష్‌ కుమార్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఇరిగేషన్‌ డిపార్మంట్‌లో ఏఈఈ(AEE)గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా 500 కోట్లకు పైగా అక్రమ సంపాదన కూడబెట్టి.. ఏసీబీ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ఆయన నివాసం తో పాటు అతని బంధువులు, స్నేహితుల నివాసాలు, కార్యాలయాల్లో కలిపి మొత్తం 19 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా సంపాదించాడని అధికారులు గుర్తించి అతనిపై కేసులు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని ఏసీబీ జడ్జి ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి డిసెంబర్ 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో నిఖేష్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా ఇదే కేసులో విచారించేందుకు ఈ రోజు ఉదయం ఏఈఈ నిఖేష్‌ కుమార్‌(AEE Nikesh Kumar)ను చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన నిఖేష్‌ ను విచారించేందకు కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతించింది. రూ.500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed