Nagarjuna : నాగార్జున పరువు నష్టం కేసు విచారణ 19కి వాయిదా

by Y. Venkata Narasimha Reddy |
Nagarjuna : నాగార్జున పరువు నష్టం కేసు విచారణ 19కి వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో నాగార్జున(Nagarjuna) వేసిన పరువు నష్టం కేసు విచారణను నాంపల్లి కోర్టు(Nampally Court) ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. గత విచారణ సందర్భంగా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కోర్టు విచారణకు హాజరుకావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే గురువారం జరిగిన విచారణలో కొండా సురేఖ తరుపున హాజరైన న్యాయవాది సురేఖ హాజరు కోసం మరో తేదీ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను మన్నించిన కోర్టు విచారణను మరో ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

కాగా ఈ కేసులో ఇదివరకే ఇరుపక్షాల వాదనలు ముగిసిపోగా, తదుపరి విచారణ కీలకంగా మారింది. మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నాగచైతన్య, సమంత విడాకులపైన, నాగార్జునపైన, కుటుంబంపైన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై ఇటు నాగార్జున, అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేశారు. ఈ రెండు కేసుల్లోనూ పిటిషనర్ల వాదనలను కోర్టు రికార్డ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed