AP:ధాన్యం కొనుగోళ్ల పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల ఫైర్

by Jakkula Mamatha |   ( Updated:2024-12-12 09:37:21.0  )
AP:ధాన్యం కొనుగోళ్ల పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల ఫైర్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇటీవల ధాన్యం కొనుగోళ్లపై మాజీ సీఎం,వైసీపీ అధినేత వైఎస్ జగన్(Former CM Jagan) చేసిన వ్యాఖ్యల పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతుకి ఎవరు అండగా నిలబడ్డారో ఒకసారి చూడండి’ అంటూ కొనుగోళ్ల పట్టికను తన పోస్టింగ్‌కు జోడించారు. ఈ మేరకు మంత్రి నాదెండ్ల ట్వీట్ చేశారు.

రైతుకు ఎవరు అండగా నిలబడ్డారో జగన్ ఒకసారి చూడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ‘‘మీ హయాంలో ఈ సమయానికి కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే సేకరించారు. బాధ్యత కలిగిన మా కూటమి ప్రభుత్వం(AP Government) 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 48 గంటల లోపే డబ్బులు జమ చేస్తున్నాం. వైఎస్ జగన్(YS Jagan) పాలనలో ఏ రోజైనా రైతులకు సక్రమంగా చెల్లింపులు చేశారా? కనీసం గోతాలు కూడా సరిపడా ఇవ్వలేకపోయారు. రైతులను దగా చేసిన మీకు నిరసన ర్యాలీలు చేసే అర్హత ఉందా?’’ అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed