Breaking: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్

by srinivas |   ( Updated:2024-12-12 09:40:53.0  )
Breaking: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్
X

దిశ, వెబ్ డెస్క్: నటుడు మంచు మోహన్ బాబు( Manchu Mohan Babu) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కుటుంబ వివాదంలో జరిగిన ఘటనతో ఆయనకు బీపీ పెరగడంతో పాటు గాయాలు అయ్యాయి. దీంతో ఆయన హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్న మోహన్ బాబుకు రిపోర్ట్స్ అన్ని నార్మల్ రావడంతో ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు.

కాగా మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం చెలరేగింది. మంచు బ్రదర్స్ విష్ణు(Vishnu, మనోజ్(Manoj) మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆస్తుల విషయంలో జల్లపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు మంచు మనోజ్ వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబు ఇంటి బౌన్సర్లు-విష్ణు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అటు విష్ణు, మోహన్ బాబు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే తన ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్తతలతో జర్నలిస్టులపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూస్ రిపోర్టర్‌పై దాడి చేశారు. ఆ తర్వాత మోహన్‌బాబు ఆసుపత్రిలో చేరారు. వైద్యం అందించిన డాక్టర్లు.. మోహన్ బాబు బీపీతో బాధపడుతున్నాడని, ఒంటిపై పలు గాయాలున్నాయని తెలిపారు. తాజాగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి నార్మల్ రావడంతో మోహన్ బాబును ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్యులు ధృవీకరించారు.

Advertisement

Next Story

Most Viewed