Encounter: ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

by Shiva |   ( Updated:2024-12-12 08:17:13.0  )
Encounter: ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్‌ (Chhattisgarh)లోని నారాయణ‌పూర్ (Narayanapur) జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దంతేవాడ (Dantewada) మండల పరిధిలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో రాత్రివ వేళ కుంబింగ్ నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా వారికి మవోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు పక్షాలు కాల్పుల మోత మోగించాయి. ఈ ఫైరింగ్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. కూబింగ్‌ ఆపరేషన్‌లో డీఆర్‌జీ (DRG), ఎస్‌టీఎఫ్ (STF), సీఆర్‌పీఎఫ్ (CRPF) బలగాలు పాల్గొన్నాయి. కాగా, ఏటూరు నాగారం (Eturu Nagaram) సమీపంలోని చల్పాక (Chalpaka) అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటన మరువక ముందే.. రాష్ట్ర సరిహద్దులో మరో ఎన్‌కౌంటర్ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed