- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao : ముమ్మాటికి మీది ప్రజా కంటక పాలన.. రైతు కంటక పాలన : హరీష్ రావు
దిశ, వెబ్ డెస్క్ : దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీ(Farmer's hand is shackled)లు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ముమ్మాటికి మీది ప్రజా కంటక పాలన.. రైతు కంటక పాలన అని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సంగారెడ్డి జైలులో గుండెపోటుకు గురై అస్వస్థత పాలైన లగచర్ల రైతు హీర్యానాయక్(Lagacharla farmer Hirya Nayak)కు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్యగా హరీష్ రావు మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన పోస్టు చేశారు. ఇంత కంటే దారుణం ఏముంటుందని.. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా..? రైతుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
వాళ్ళ భూములు గుంజుకుంటారు..తిరగబడితే అరెస్టులు చేస్తారు.. వాళ్ళను ఉగ్రవాదులుగా భావిస్తూ అత్యంత క్రూరంగా వ్యవహరిస్తారని..సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం.. ఇదేనా మీ ప్రజాపాలన? అంటూ హరీష్ రావు నిలదీశారు.