- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొనసాగనున్న ఎల్లో వార్నింగ్.. మరో రెండు రోజులు వర్షాలు
దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజుల పాటు కంటిన్యూ అవుతుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. సముద్ర మట్టానికి దాదాపు ఒక కి.మీ. ఎత్తులో కొనసాగుతున్న ఈ ద్రోణి కారణంగా తెలంగాణతో పాటు దక్షిణ కర్నాటక, పశ్చిమ విదర్భ, మరాఠ్వాడా, రాయలసీమ తదితర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. తాజా వానలతో రాష్ట్రంలోని 30 జిల్లాలోల ఈ కాలంలో కురవాల్సినదానికంటే ఎక్కువే నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ములుగులో 12 సెం.మీ. వర్షపాతం నమోదైందని వివరంచింది. వేసవి కాలంలో అకాల వర్షాల కారణంగా వడగండ్లతో లక్షలాది ఎకరాల్లో చేతికొస్తున్న పంటలకు నష్టం వాటిల్లింది.
రానున్న రెండు రోజుల పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, జనగాం, భువనగిరి, రంగారెడ్డి తదితర 13 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడతాయని అంచనా వేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు నెలల వ్యవధిలో ఎనిమిది జిల్లాల్లో సాధారణంకంటే 60% మేర ఎక్కువగానే వర్షపాతం నమోదైందని, 22 జిల్లాల్లో 50% లోపు ఎక్కువగా కురిసినట్లు తెలిపింది. కేవలం సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే సాధారణం స్థాయిలో ఉన్నట్లు వివరించింది.