తప్పకుండా వివరణ ఇస్తా.. BJP అధిష్టానంపై RajaSingh కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2022-08-24 06:55:15.0  )
తప్పకుండా వివరణ ఇస్తా.. BJP అధిష్టానంపై RajaSingh కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహ్మద్ ప్రవక్తపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్ రాజాసింగ్‌పై సస్పెషన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వివాదస్పద వ్యాఖ్యలపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తాజాగా దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. షోకాజ్ నోటీసులపై త్వరలోనే సమాధానం ఇస్తానని తెలిపారు. నా వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని.. పార్టీ నన్ను వదులుకోదని భావిస్తున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై పూర్తి నమ్మకం ఉందన్నారు. నా వీడియోలో ఏ మతాన్ని కించపరచలేదని.. నాపై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.

Advertisement

Next Story