- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kaloji: ప్రభుత్వానికి కాళోజీపై ఎందుకింత కక్ష!
దిశ, డైనమిక్ బ్యూరో : 2014లో మొదలైన కాళోజీ కళాక్షేత్రం పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వానికి కాళోజీపై ఎందుకింత కక్ష?! అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ విలాసవంతమైన జీవనం కోసం నెలల వ్యవధిలో ప్రగతి భవన్ పూర్తైందని ఆరోపించారు. మరోవైపు రాజకీయం కోసం 33 జిల్లాల్లో కార్పొరేట్ తరహా పార్టీ ఆఫీసులు పూర్తయ్యాయి. కానీ, ఎనిమిదేళ్లైనా కాళోజీ కళాక్షేత్రం మాత్రం మొండి గోడలతో మిగిలింది అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
తెలంగాణ ఏవనిపాలయ్యిందిరో..! అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ప్రభుత్వం పనులు మొదలు పెట్టి ఎనిమిదేళ్లు గడిచింది.. ఈ ఏడాది కాళోజీ జయంతి నాటి వరకు పనులు పూర్తవుతాయని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ, ఈ జయంతి వేడుకలకు కూడా పనులు పూర్తి కాకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Also Read : అక్షర కర్షకుడు కాళోజీ