- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగా ఎందుకు చేయాలంటే? మంత్రి దామోదర రాజనర్సింహ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం యోగ అని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. జూన్ 21న ప్రపంచ యోగ డే కర్టెన్ రైజర్ పురస్కరించుకుని పీపుల్స్ ప్లాజా, నెక్లెస్‌రోడ్‌లో యోగ డే వాక్ కార్యక్రమం ఆరోగ్య శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప చారిత్రక సంపద యోగ అని చెప్పారు. యోగా ఎందుకు చేయాలంటే? యోగా సాధన వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు.
మన ఆరోగ్యాన్ని కాపోడుకోవాలని, దినచర్యను క్రమశిక్షణతో నడిపించుకోవాలని, వీటన్నింటికి దిక్సూచి యోగ మాత్రమేనని అన్నారు. ప్రతి స్కూల్లో, కాలేజీల్లో యోగను దినచర్యగా, పవిత్ర చర్యగా ప్రాక్టీస్ చేయాలని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలో, కళాశాలలో ఘనంగా నిర్వహించాలని, యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. కాగా, జీఎన్‌ఎంసీ, జేఎస్‌పీఎస్ కళాశాల విద్యార్థులతో కలిసి పీపుల్స్ ప్లాజా వరకు మంత్రి వాకింగ్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు.