మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-05 04:55:36.0  )
మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై వరుస విమర్శలు సంధిస్తునే ఉన్నారు. తాజాగా మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరని, రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరంటూ మండిపడ్డారు. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరని, అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? అని ప్రశ్నించారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు? మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 1లక్ష 50వేల కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు? అంటూ తన ట్వీట్ ద్వారా ప్నశ్నాస్త్రాలు సంధించారు.

Advertisement

Next Story

Most Viewed