OG Movie : ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది.. ఇది కదా పవర్ స్టార్ రేంజ్ అంటే..!

by Prasanna |   ( Updated:2024-10-05 07:06:26.0  )
OG Movie : ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది.. ఇది కదా పవర్ స్టార్ రేంజ్ అంటే..!
X

దిశ, వెబ్ డెస్క్ : పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇంకో వైపు ఆగిపోయిన సినిమాల షూట్ లు మొదలుపెట్టిన విషయం మనకీ తెలిసిందే. సమయం ఉన్నప్పుడు హరిహర వీరమల్లు షూట్ చేస్తున్నారు. అది అయ్యాక OG షూట్ లో పాల్గొంటారు. పవన్ అభిమానులు OG మూవీ కోసం ఎంతో గానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, ఈ మూవీ నుంచి వచ్చిన పాట, టీజర్ భారీ హైప్ ను క్రియోట్ చేశాయి.

గేమ్ ఛేంజర్ అప్డేట్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ OG అప్డేట్స్ కూడా అడుగుతున్నారు. దీంతో తమన్ OG మూవీ గురించి ఆసక్తికర ట్వీట్ చేసాడు.

తమన్ " అందరూ OG అప్డేట్స్ గురించి అడుగుతున్నారు. త్వరలోనే అన్ని చెబుతాము. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అవుతుంది. సుజీత్ అదరగొట్టేసాడు. కెమెరామెన్ రవిచంద్రన్ కూడా కళ్ళు చెదిరిపోయే విజువల్స్ ఇచ్చాడు. ఇప్పుడు, నేను OG కు బెస్ట్ ఇవ్వాలి. ఈ OG DVV మూవీస్ బ్యానర్ కు బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. నా ట్వీట్ మీరందరూ పిన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ తో త్వరలో మళ్ళీ కలుద్దామని " అని ట్వీట్ లో రాసుకొచ్చాడు. దీంతో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు OG మూవీ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed