ఆ సినిమా షూటింగ్ సెట్‌లో ప్రతి రోజూ ఏడ్చేదాన్ని.. త్రిప్తి షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-10-05 06:15:27.0  )
ఆ సినిమా షూటింగ్ సెట్‌లో ప్రతి రోజూ ఏడ్చేదాన్ని.. త్రిప్తి షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ రణ్‌బీర్ సరసన ‘యానిమల్’ మూవీలో (Animal movie) నటించి ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తన అందంతో యూత్ కలల రాణిగా ముద్ర వేసుకుంది. అలాగే త్రిప్తి నేషనల్ క్రష్‌గా కూడా ఫుల్ క్రేజ్ సంపాదించుకుని వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఆమె సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ పిక్స్ షేర్ చేస్తోంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘చదువులో రాణించలేకపోయాను. దీంతో మోడలింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఆ ఫిల్డ్‌కి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. కానీ నా తల్లిదండ్రులు దానికి ఒప్పుకోలేదు. అయినా పట్టుదలతో అడుగుపెట్టాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫొటోగ్రఫీ డైరెక్టర్, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అప్పటికే నేను నటనలో కనీసం ఓనమాలు కూడా నేర్చుకోలేదు. అయినప్పటికీ విభిన్నంగా ప్రయత్నించాలనుకున్నా దీంతో తోటి నటీనటులతో కలిసి ప్రతి సన్నివేశాన్ని చర్చించే దాన్ని.

ఇండస్ట్రీకి వచ్చి సరైన నిర్ణయం తీసుకున్నానా? లేదా అనే ఆలోచన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. అయితే లైలా మజ్ను సమయంలో సెట్స్‌లో ప్రతిరోజూ ఏడ్చేదాన్ని. ఎందుకంటే వాళ్ళు చెప్పే భాష నాకు అర్థమయ్యేది కాదు. ఇంటికెళ్లి నా పాత్రకు సంబంధించిన డైలాగ్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా నటన నేర్చుకుని ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించు కోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ త్రిప్తి కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


Advertisement

Next Story